ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeఅంతర్జాతీయం15 గంటల పాటు విలేకరుల సమావేశం - ముయిజ్జు రికార్డు

15 గంటల పాటు విలేకరుల సమావేశం – ముయిజ్జు రికార్డు

📰 Generate e-Paper Clip

జయజయహే : మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు రికార్డు నెలకొల్పారు. దాదాపు 15 గంటల పాటు విలేకరుల సమావేశంలో పాల్గొని.. ఆ ఘనత సాధించిన ప్రపంచంలోని మొదటి దేశాధ్యక్షుడిగా నిలిచారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారని అధికారులు తెలిపారు. మధ్యలో ప్రార్థనల కోసం చిన్న విరామం ఇచ్చి.. 14 గంటల 54 నిమిషాల పాటు ప్రసంగించారని పేర్కొన్నారు. ఇందులో చాలా భాగం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిపారు. శనివారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఉన్న రికార్డును ముయిజ్జు అధిగమించినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం తెలిపింది. 2019 అక్టోబర్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. 14గంటలపాటు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి రికార్డు నెలకొల్పారు. 2009లో మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మొహమ్మద్ నషీద్ హిందూ మహాసముద్రం అడుగున క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గ్లోబల్‌ వార్మింగ్‌ మూలంగా సముద్ర మట్టాలు పెరగడంతో దిగువ స్థాయిలో ఉన్న తమ దేశాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలకు చెప్పడానికి అప్పట్లో ఆయన ఈ విధంగా వినూత్నంగా నిరసన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!