Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీసారీ.. సార్..!

సారీ.. సార్..!

పొరపాటున తప్పు జరిగింది

అప్పటికప్పుడు కలెక్టర్ కు లేఖ రాశా

ఆ సమయంలో మీరు అందుబాటులో లేరు

నడిరోడ్డుపై గంటాకు విష్ణకుమార్ రాజు క్షమాపణలు

ఫిల్మ్ నగర్ క్లబ్ పై ఇటీవల ఫిర్యాదుపై వివరణ

కూటమి ఎమ్మెల్యేల పంచాయతీపై విస్తుపోయిన జనం

విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల ఫిలింనగర్ క్లబ్ లీజ్ విషయంలో విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు లేఖ రాశారు. అయితే ఆ వ్యవహారం భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని.. తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్లారని అంటూ విష్ణు కుమార్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికీ తీసుకెల్లే సమయంలో మీరు అందుబాటులో లేరని.. గంటా శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు విష్ణు కుమార్. శనివారం జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ పదవిపై కూటమి నేతలు ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై ఓటింగ్ కు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఆ సమయంలో గంటా కారులో కూర్చొని సీరియస్ గా మాట్లాడుతుంటే.. విష్ణు కుమార్ రాజు కారు పక్కనే నిలబడి సమాధానం చెబుతూ ఉన్నారు. ఈ తతంగాన్ని మీడియా వీడియోలు తీసింది. గంటా శ్రీనివాసరావు మాత్రం వినకుండా కేకలు వేస్తూ వాహనంలో కూర్చొని మరింత ఆగ్రహంతో స్పందించారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2014లో విశాఖ ఫిల్మ్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. సినిమా , సాంస్కృతిక కార్యకలాపాల ప్రభుత్వం నుండి భూమిని లీజుకు తీసుకుంది. ఈ భూమి విలువైన బీచ్ రోడ్డు ప్రాంతంలో ఉండటం వల్ల, దీనిపై రాజకీయ నాయకులు , వివిధ గ్రూపుల దృష్టి పడింది. వైఎస్ఆర్‌సీపీ హయాంలో క్లబ్ పాలకవర్గం మారిపోయింది. విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారాలు నడిచాయని చెబుతారు. 2024 జూన్‌లో, క్లబ్‌లోని “వైఎస్ఆర్ లాన్స్” అనే పేరును క్లబ్ సభ్యులు తొలగించారు. గత వైసీపీ ప్రభుత్వం క్లబ్‌పై ఒత్తిడి చేసి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరుతో బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ చర్యను క్లబ్ సభ్యులు వ్యతిరేకించారు, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత, ఈ పేరును తొలగించారు. ఈ క్లబ్ లీజు వ్యవహారంలో ఏం జరిగిందో కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం.. విష్ణుకుమార్ రాజు జోక్యాన్ని సహించలేదు. ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ క్లబ్ భీమిలి నియోజవర్గంలోకి రావడమే కాదు ఆ క్లబ్ ఏర్పాటులో గంటా శ్రీనివాసరావు కూడా కీలక పాత్ప పోషించారు. విష్ణుకుమార్ రాజు క్షమాపణలు చెప్పినందున .. ఈ వ్యవహారంలో ఇంతటితో సద్దుమణిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?