Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీసాయి సంజీవిని జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

సాయి సంజీవిని జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

జయజయహే : యువత వ్యాయం పట్ల శ్రద్ధ చూపడం వలన శరీరధారుధ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పొందుతారని సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు .దక్షిణ నియోజకవర్గం లో డాబా గార్డెన్స్ వద్ద శారదా వీధిలో ఏర్పాటైన సాయి సంజీవిని జిమ్ ను సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాయామం అలవాటు చేసుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. రోజులో కనీసం కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, టిడిపి, జనసేన ,బిజెపి నాయకులు, నిర్వాహకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం 33 వార్డ్ జనసేన పార్టీ నేత వేగి వెంకట అప్పారావు గృహ ప్రవేశ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, జనసేన ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి జి కె తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ , కూటమి నేతలు పాల్గొన్నారు…

                                   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?