ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీడీసీఎంఎస్ చైర్మన్ బాలాజీ కి సత్కారం

డీసీఎంఎస్ చైర్మన్ బాలాజీ కి సత్కారం

📰 Generate e-Paper Clip

చోడవరం, జయజయహే : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ విశాఖ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ గా నియామకమైన నేపథ్యంలో శుక్రవారం అనకాపల్లి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిగిరిశెట్టి శ్రీరామమూర్తి, పృధ్వీ, ప్రదీప్, టీడీపీ బుచ్చయ్యపేట మండలం యాదవ సంఘం అధ్యక్షుడు సింగంపల్లి రమేష్ మర్యాదపూర్వకంగా బాలాజీ ని కలసి శుభాకాంక్షలు తెలియజేసి సాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. 2013లో తెలుగు నాడు విద్యార్థి సంఘం (టీఎన్ఎస్ఎఫ్) కీ కోట్ని బాలాజీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. పార్టీకి బాలాజీ అందించిన సేవలకుగాను ప్రభుత్వం డీసీఎంఎస్ చైర్మన్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!