ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఅనకాపల్లిలో 122 కిలోల గంజాయి పట్టివేత

అనకాపల్లిలో 122 కిలోల గంజాయి పట్టివేత

📰 Generate e-Paper Clip

ఐదుగురు అరెస్టు వెల్లడించిన ఎస్పి

అనకాపల్లి జయజయహే : అనకాపల్లి మండలం సంపతిపురం వద్ద వాహన తనిఖీల్లో శనివారం పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. ఒరిస్సా రాష్ట్రం పాడువ నుండి విశాఖ రైల్వే స్టేషన్ కు ఆటోలో తరలిస్తున్న 5.5 లక్షలు విలువచేసే 122 కేజీల గంజాయి అనకాపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం ఈ మేరకు మధ్యాహ్నం అనకాపల్లి పోలీస్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఒరిస్సా రాష్ట్రం కోరా పుట్టుకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి ఒక బైక్, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.గంజాయి పట్టుకున్న పోలీసులకు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు

                             

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!