జయజయహే : శివాజీపాలెం లో కొలువుతీరిన శ్రీ శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ , పద్మజా దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు . అమ్మవారి పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించారు. అమ్మవారికి పసుపు కుంకుమతో పాటు చీర సారే సమర్పించారు. అనంతరం శ్రీ కృష్ణ సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీతో పాటు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
శ్రీ శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు
0
48
Previous article
RELATED ARTICLES

