జయజయహే : సుమారు 40 లక్షల వ్యయంతో సెక్టార్ –1, ఎం వి పి కాలనీ (వెంకోజిపాలెం) ఉన్న వి. ఎం. ఆర్. డి. ఎ కళ్యాణమండపం మేయర్ పీలా శ్రీనివాసరావు , విశాఖ తూర్పు నియోజక వర్గం శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, వి. ఎం. ఆర్. డి. ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమీషనర్ కె. ఎస్ విశ్వనాథన్ ఐ ఎ ఎస్ ., చేతులమీదుగా నవీకరణ అనంతరము పునః ప్రారంభోత్సవం గావించబడినది. ఈ సందర్భంగా చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ఇది పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే కళ్యాణ మండపం అని చాలా తక్కువ సమయంలో దీని నవీకరణకు సాంకేతిక విభాగం సమష్టిగా చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి సత్యనారాయణ , జాయింట్ కమీషనర్ రమేష్, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ప్రధాన గణాంకాధికారి హరిప్రసాద్, డి ఎఫ్ ఓ సుజాతా శివానీ, పర్యవేక్షక ఇంజనీర్ భవానీ శంకర్, కార్యనిర్వహక ఇంజినీర్లు రామరాజు, సుధీర్, ఉప కార్య నిర్వాహక ఇంజనీర్ శిరీష, సహాయక ఇంజనీర్ శర్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
వి. ఎం. ఆర్. డి. ఎ. కళ్యాణమండపం పునః ప్రారంభోత్సవం
0
42
Previous article
Next article
RELATED ARTICLES

