Saturday, April 11, 2026
Homeవిద్య సమాచారంవిద్యా ప్రదాత వాసుపల్లి గణేష్ కుమార్

విద్యా ప్రదాత వాసుపల్లి గణేష్ కుమార్

పేద విద్యార్థికి రూ. 10,000 ఆర్థిక సాయం

విశాఖపట్టణం : జయజయహే : అన్ని దానాలలో విద్యాదానం ప్రధానమైనది. ప్రజా సేవకుడిగా ఒకపక్క కనిపించే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విద్యా ప్రదాతగా ఎంతోమంది పేద విద్యార్థులకు చేయూతనందించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. 27వ వార్డుకు చెందిన పందిరి ఆశిష్ కు కాలేజీ ఫీజు నిమిత్తం రూ.10,000 లు సొంత నిధులతో నగదును అందజేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో సోమవారం ఉదయం 27వ వార్డు అధ్యక్షుడు సర్వేశ్వర రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు సహాయంతో వాసుపల్లి గణేష్ కుమార్ ని కలిశారు. పేద ప్రజలను ఆదుకోవడంలో ఆపద్బాంధవుడిగా, విద్యార్థులకు విద్యా ప్రదాతగా సేవలందించే వాసుపల్లి గణేష్ కుమార్ తనదైన శైలిలో స్పందించి తక్షణమే 10,000 నగదును ఆర్థిక సాయం చేశారు. మంచి ఉన్నత స్థాయికి ఎదిగి, పదిమందికి సహాయం అందించాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆ విద్యార్థికి ప్రోత్సాహం అందించారు. ఆరోగ్య ప్రదాతగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేదలకు అందిస్తే.. ఆయన వారసుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఫీజు రియంబర్స్మెంట్లు, మెడికల్ కళాశాలలు నిర్మాణం, అమ్మఒడి పేరుతో లక్షలాదిమంది తల్లులకు రూ.15000 అందించిన వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయిందని దుయ్యబట్టారు. కనీసం సూపర్ సిక్స్ లో ఒక పథకాన్ని కూడా అమలు చేయలేని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు అబద్దాల హామీలతో అందలం ఎక్కారని విమర్శించారు. అడ్డదారుల్లో విశాఖ నగర మేయర్ స్థానాన్ని కైవసం చేసుకొని విజయోత్సవ సంబరాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమంలో 27 మాజీ కార్పొరేటర్ పద్మనాభం అమ్మాజీ, 30 వార్డు ఇంచార్జి దశమంతల చిన్ని, సౌత్ ఎస్సీ సెల్ ఆకుల శ్యామ్, నారాయణ మూర్తి, చింతకాయల వాసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?