మాడుగుల: జయజయహే : మాడుగుల గాంధీ పార్క్ వద్ద ఉన్న శ్రీ విజయ ఆంజనేయ స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు శనివారం ప్రారంభమయ్యాయి. సుమారు 5 లక్షల రూపాయలతో భక్తులు సహకారంతో ఆలయ పునర్నిర్మాణం గోపురం నిర్మాణం పనులుకి శనివారం స్థానిక బీమా ప్రతినిధి పాలకుర్తి సురేష్ కుమార్, భూమి పూజ నిర్వహించారు. గోపురంతో పాటు ఆలయానికి కోదండ రాముని సెట్టుతో కూడిన ఆర్చి నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించారు.ఇoదుకు గ్రామస్తులు దాతలు సహకారాన్నించాలని ఆలయ నిర్వహణ ప్రతినిధి నాగోజి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. వచ్చేనెల 22 హనుమాన్ జయంతి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కాబట్టి భక్తులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జవాది వరహాలు, పుట్టా నానాజీ, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విజయ్ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం
RELATED ARTICLES
