ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీవిజయనగరంలో ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు..

విజయనగరంలో ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు..

📰 Generate e-Paper Clip

విజయనగరంలో సిరాజ్‌కు ఉగ్ర లింకులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుపై విజయనగరంలో ఎన్‌ఐఏ విస్తృతమైన దర్యాప్తును నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది

 ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ఏజెఎన్సీల దూకుడు కొనసాగుతోంది. సిరాజ్ కుటుంబసభ్యుల కదలికలపై దర్యాప్తు సంస్థలు గట్టి నిఘా ఉంచాయి. సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో (Bank Account) భారీగా నగదును గుర్తించారు. కేసు నేపథ్యంలో సిరాజ్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అయితే డీసీసీబీ బ్యాంక్‌లో ఉన్న లాకరు తెరిచేందుకు సిరాజ్ తండ్రి విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఖాతాను సీజ్ చేయడంతో లాకర్ తెరవటానికి కుదరదని సిరాజ్ తండ్రికి బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయంపై రెండు రోజుల పాటు బ్యాంక్ అధికారులను సిరాజ్ తండ్రి కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏఎస్‌ఐగా పని చేస్తున్న సిరాజ్ తండ్రితో పాటు కుటుంబ సభ్యుల కదలికలపై దర్యాప్తు సంస్థలు మరింత నిఘా పెట్టాయి.

సిరాజ్‌కు ఉగ్ర లింకులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుపై విజయనగరంలో ఎన్‌ఐఏ విస్తృతమైన దర్యాప్తును నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది. సిరాజ్‌కు చెందిన డీసీసీబీ బ్యాంక్ ఖాతాలో భారీగా నగదు జమ అయినట్లు నిర్ధారణకు వచ్చింది ఎన్‌ఐఏ. సిరాజ్ తండ్రి పేరుతో డీసీసీబీలో ఓ లాకర్ ఉంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న దశలో సిరాజ్ తండ్రి బ్యాంక్ తాలూకా లాకర్‌ను తెరిచేందుకు చాలా ప్రయత్నం చేసినప్పటికీ అది కుదరదని, సీజ్ చేయడం జరిగిందని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఖాతాలో సుమారు రూ.42 లక్షల వరకు నగదు జమ అయినట్టు గుర్తించారు. సిరాజ్ తండ్రి ఏఎస్‌ఐగా పనిచేస్తుండగా.. సిరాజ్ సోదరుడు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. దీంతో వీరి కదలికలపై దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో నిఘా పెట్టాయి.

సిరాజ్‌ ఖాతాలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు జమ చేశారు అనే దానిపై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. ఈరోజు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. సిరాజ్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల ఖాతాలపై కూడా దృష్టి సారించారు. అందులో సిరాజ్ ఎవరితో చాటింగ్ చేశాడు, ఏఏ అంశాలపై ఎవరితో మాట్లాడారు.. ఆంధ్రాతో పాటు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వీరికి సంబంధించిన నెట్‌ వర్క్‌ను గుర్తించి వీరు ఎలాంటి సంభాషణలు కొనసాగించారు అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు పరిశీలించే పనిలో పడ్డాయి. ఇదిలా ఉండగా ఉగ్ర లింకుల కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, సమీర్‌లు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు. వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. వీరిరువురిని కస్టడీకి ఇస్తే ఉగ్రలింకులకు సంబంధించి మరింత సమాచారం బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!