ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీవార్డు అభివృద్ధికి నూతన ఆలోచనతో సహకరించండి.

వార్డు అభివృద్ధికి నూతన ఆలోచనతో సహకరించండి.

📰 Generate e-Paper Clip

టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

జయజయహే : భీమిలి జోన్ అభివృద్ధికి నూతన ప్రణాళికతో సిద్ధం కావాలని అందుకు మా సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు నూతన కమీషనర్ నమ్మి అయ్యప్పకు విజ్ఞప్తి చేసారు. భీమిలి జోన్ కు నూతనంగా వచ్చిన కమీషనర్ నమ్మి అయ్యప్పను 3వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి శాలువా, ప్లవర్ బొకేతో శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడుతూ భీమిలికి ఒక మంచి చరిత్ర ఉందని అన్నారు. ఆ చరిత్రకు ఎటువంటి మచ్చ లేకుండా అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. భీమిలి ప్రజలు సౌమ్యులని, అధికారులు తీసుకున్న ఎటువంటి మంచి నిర్ణయానికైనా పూర్తిస్తాయి సహకారం ఉంటుందని అన్నారు. సచివాలయం వ్యవస్థను గాడిలో పెట్టాలని అన్నారు. సంబంధిత అధికారులతో గ్రామాల్లో సందర్శించి స్థానిక సమస్యల పరిష్కారం కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అందుకు మా తెలుగుదేశం పార్టీ నుండి పూర్తిగా మద్దతు ఉంటుందని గంటా నూకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చురకల రమణ, కాసరపు నాగరాజు, మారోజు సంజీవకుమార్, కొక్కిరి అప్పన్న, గిడుతూరి శ్రీనివాసరావు, వాడమొదలు సత్యారావు, జలగడుగుల మురళి, సంకురుభుక్త జోగారావు, రాజగిరి రమణ, కుప్పిల గురుమూర్తి, వియ్యపు పోతురాజు, నెక్కెళ్ళ వెంకటరావు, గండిబోయిన పోలిరాజు, కాసరపు ఎల్లాజీ, మట్టా దాసు, అప్పికొండ నర్సింగరావు, సత్తరవు చిన్నారావు, కందుల సుందర్ రావు, కృష్ణారావు మాస్టర్, చింతపల్లి రాము, వెంకటరావు, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!