ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeవాతావరణంవాతావరణ హెచ్చరికల నేపధ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వాతావరణ హెచ్చరికల నేపధ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

అవాంచనీయ సంఘటనల సమాచారానికి టోల్ ఫ్రీ నంబర్ 18004256826

జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్

పాడేరు, జయజయహే : రానున్న నాలుగు రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు కలెక్టరేట్ లో 24 గంటలు పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు. ఈ నెల ఐదవ తేదీన పిడుగులతో కూడిన మధ్యస్తం నుండి భారీ వర్షాలు పడే అవకాశముందని అదే విధంగా గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేచే అవకాశం ఉందన్నారు, 6,7,8 తేదీలలో అల్పం నుండి మధ్యస్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపధ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞాప్రి చేసారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులు వారి వారి ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండి విపత్తు సంభవిస్తే ఎదుర్కొనేందుకు ప్రజలకు సహాయ సహాకారాలు అందించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా కలెక్టరేట్ లో 24 గంటలూ పనిచేసే విధంగా టోల్ ఫ్రీ నంబర్ 18004256826 తో కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని, కంట్రోల్ రూమ్ విధులు నిర్వర్తించడానికి కలెక్టరేట్ సిబ్బందికి ప్రత్యెక విధులు కేటాయించడం జరిగిందని వివరించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది పర్యవేక్షణకు తహసిల్దార్ స్థాయి అధికారులను కూడా కేటాయించడం జరిగిందన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటలు జరిగినా టోల్ ఫ్రీ నంబర్ 18004256826 కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!