Wednesday, April 15, 2026
Homeభక్తివాడపల్లికి విజయనగరం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసు

వాడపల్లికి విజయనగరం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసు

విజయనగరం : జయజయహే : కోనసీమలో ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26 నుంచి ప్రతి శుక్రవారం విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నామని మేనేజర్‌ శ్రీనివాసరావు నేడు పత్రిక ప్రకటనలు తెలిపారు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. భక్తుల కోరిక మేరకు ప్రతీ శుక్రవారం రా. గం.8.00 లకు క్రొత్త సూపర్ లక్జరి బస్సు విజయనగరం నుండి బయలుదేరి శనివారం తెల్లవారుజామున గం. 04.00 లకు వాడపల్లి చేరుకొని తిరిగి మరలా ఉదయం. 09.00 లకు వాడపల్లి నుండి బయలుదేరి సాయంత్రం గం.04.00 లకు విజయనగరం చేరును. టికెట్ ధర రు.1200/- చెల్లించి బస్సు స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ నందు గాని, వెబ్ సైట్ నందు www.apsrtconline.in ద్వారా గాని టికెట్ ముందుగా బుక్ చేసుకొనవచ్చును. మరిన్ని వివరములకు 9959225620,9494331213 సంప్రదించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?