రెవెన్యూ అధికారులు మరియు నేషనల్ హైవే సిబ్బందితో సమీక్ష
జయజయహే : పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం లో నాలుగు గ్రామాల రైతులు చెన్నయ్యపాలెం, తవ్వవానిపాలెం, పెద్ద నాయుడుపాలెం, ఆదిరెడ్డిపాలెం గ్రామ ప్రజలతో రాయపూర్ టు విశాఖపట్నం నేషనల్ హైవే విస్తరణలో భాగంగా సబ్బవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామం నందు కోల్పోతున్న నీటిపారుదల వసతులన్నీ పునర్న నిర్మించవలసిందిగా కోరుతూ రైతులు, రెవెన్యూ అధికారులు మరియు నేషనల్ హైవే సిబ్బందితో సమీక్ష కార్యక్రమం నిర్వహించి రోడ్డు విస్తీర్ణ పనులను చెరువు ఆయకట్టను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు .ఈ యొక్క సమీక్ష కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ ప్రస్తుత రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తిగా కూల్చివేసి రైతులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా రోడ్డు కాంట్రాక్టర్ వారు వ్యవహరిస్తున్నారని కావున సదరు సమస్యలు పరిష్కరించే దిశగా పునః పరిశీలించవలసింది గా రైతులందరూ కోరుకోవడం జరిగినది సదరు ఈ విషయమై స్థానిక శాసనసభ సభ్యులు రమేష్ బాబు సానుకూలంగా స్పందించి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా అధికారులందరితో సమీక్ష నిర్వహించి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకు వెళ్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి చిన్ని కృష్ణ, ఇరిగేషన్ జె ఇ నళిని , రెవెన్యూ ఆర్ ఐ వీరయ్య , నేషనల్ హైవే ఉన్నతాధికారులు, మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు , మొదలగు స్థానిక ముఖ్య గ్రామ నాయకులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క సమీక్షా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగినది.


