ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీనేడు వాసవి విద్యానిధి పథకం ప్రారంభం

నేడు వాసవి విద్యానిధి పథకం ప్రారంభం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: జయజయహే : అంతర్జాతీయ వాసవి క్లబ్ మరొక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కొత్త పథకాలకు శ్రీకారం చుట్టి వాసవి సభ్యుల మన్ననలు పొందుతున్న తరుణంలో తాజాగా వాసవి విద్యా నిధి పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని ఈ నెల రెండో తేదీన సికింద్రాబాద్ లో గల ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించనున్నట్టు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గురువారం సాయంత్రం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ బిజెపి నాయకులు చికోటి ప్రవీణ్ హాజరవుతున్నారని తెలిపారు. వాసవి క్లబ్ లో ఎవరైనా నిరుపేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటే అలాంటి విద్యార్థిలకు 25 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం కోటి రూపాయలు విద్యానిధిని ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి పేద విద్యార్థులు ఎవరైనా ఈ పథకంలో లబ్ధి పొందాలంటే జిల్లా గవర్నర్ల ద్వారా విసీఐకి దరఖాస్తు అందజేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!