ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీరాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు అరుదైన గౌరవం

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు అరుదైన గౌరవం

📰 Generate e-Paper Clip

జయజయహే : వియత్నాంలో జరిగే బుద్ద భగవానుని అవశేషాల ప్రదర్శన కార్యక్రమ బాధ్యతను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి కందుల దుర్గేష్ కి అప్పగిస్తూ పీఎంవో ఆదేశాలు జారీచేసారు . వియత్నాం ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్దుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హో చి మిన్హ్ నగరంలో ప్రదర్శన చేయనున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో దేశంలోని బుద్ధుడి పవిత్ర అవశేషాలను(కపిల్వాస్తు అవశేషాలు) పటిష్ట భద్రత నడుమ భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్) చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో కేంద్రం పంపనుంది . బౌద్ధ మత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను మే1 న న్యూఢిల్లీ నుండి ప్రదర్శనకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి . మే 6 వరకు వియత్నాంలో జరగనున్న ప్రదర్శన.. అనంతరం రాష్ట్రానికి మంత్రి కందుల దుర్గేష్ తిరిగి రానున్నారు . తద్వారా వియత్నాం, భారతదేశ బౌద్ధ సమాజాలు, ప్రజల మధ్య దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఏప్రిల్ 30న న్యూఢిల్లీ మంత్రి కందుల దుర్గేష్ చేరుకోనున్నారు. మంత్రి కందుల దుర్గేష్ కు లభించిన ప్రత్యేక గౌరవంపై ప్రభుత్వం నుండి, ప్రజల నుండి ప్రశంసల వెల్లువ. తనకు లభించిన అవకాశంపై మంత్రి దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు .

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!