: ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఫొటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు.
11వ యోగా ఇంటర్నేషనల్ డేను (Yoga International Day) ఆంధ్రప్రదేశ్లో (Andhrapradesh) ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నాగరికతకు భారతదేశం పెట్టింది పేరన్నారు. యోగా మన వారసత్వమని.. యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని చెప్పుకొచ్చారు. యోగా అనేది కొద్దిమందికో లేక.. కొన్ని ప్రాంతాలకో సంబంధించింది కాదన్నారు
అందరి జీవితాల్లో యోగా అనే ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు. ఫొటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష , పట్టుదలతో చేస్తున్నారన్నారు. నేటి (బుధవారం) నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర -2025పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 5 లక్షల మందితో వచ్చే నెల 21 తేదీన యోగా డే నిర్వహిస్తామని.. ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో యోగ డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు.


