ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమెడికల్ ఖర్చులకు వాసుపల్లి ఆర్థిక సాయం

మెడికల్ ఖర్చులకు వాసుపల్లి ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

ఇచ్చిన మాట తప్పని జననేత జగన్ మాత్రమే

ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

జయజయహే : వెన్నుపూస వ్యాధితో బాధపడుతున్న ఉమ్మడి రాజేష్ అనే యువకుడికి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10, 000 మెడికల్ ఖర్చులకు అందజేశారు. 34వ వార్డుకు చెందిన ఓ పేద కుటుంబానికి ఆసరా కల్పించడానికి సోమవారం వాసుపల్లి స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది పేదలకు కార్పొరేట్ వైద్యం కల్పించిన వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించి ఆరోగ్యశ్రీలో సేవలు చేర్చారన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు అవసరమైన విద్యా వైద్యం నిర్లక్ష్యం చేస్తుందని దుయ్యబట్టారు. ప్రజలు నాడి తెలుసుకున్న జననేత వారికి ఏం కావాలో వాటిని మేనిఫెస్టోలో చేర్చి 99 శాతం ప్రజలకు సంక్షేమం పరిపాలన అందించిన ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ప్రజలు కూటమి మాటలు నమ్మి ఓటు వేసినందుకు తగిన గుణపాఠం చెప్పారని బాధపడుతున్నారన్నారు. మళ్లీ వైఎస్ఆర్సిపి సంక్షేమ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ తో పాటు అభివృద్ధి అందించాలని కూటమి ప్రభుత్వాన్ని వాసుపల్లి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తోట పద్మావతి, ఆలయ చైర్మన్ లండ రమణ, 34 వ వార్డ్ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు లింగం శ్రీను, అంబటి అప్పలరాజు, దూడ అప్పారావు, సౌత్ క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షులు సువార్త రాజు (సుబ్రహ్మణ్యం), సౌత్ బూత్ కమిటీ మరియు 39వ వార్డ్ అధ్యక్షులు ముజుబ్ ఖాన్, సౌత్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకుల శ్యామ్,గంగళ రామరాజు, తదితర వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!