ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమహానాడులో లోకేష్ కు పార్టీ భాధ్యతలు అప్పగించే ఛాన్స్?

మహానాడులో లోకేష్ కు పార్టీ భాధ్యతలు అప్పగించే ఛాన్స్?

📰 Generate e-Paper Clip

చంద్రబాబు నిర్ణయం

టీడీపీలో ప్రస్తుతం నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా లోకేష్ చేసిన ప్రతిపాదన తో ఇప్పుడు లోకేష్ ను ఆ పదవి కంటే మెరుగైన పదవి లేదా మార్పు చేయాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోకేష్ కు ప్రమోషన్ మాత్రమే దక్కే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిండెట్ పదవి లేదంటే కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వటం ఖాయమని పార్టీ వర్గాల సమాచారం. అదే విధంగా సుదీర్ఘ కాలంగా పార్టీ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న సీనియర్ల కు స్థాన చలనం తప్పేలా లేదు. వారిలో కొందరి ని కొనసాగిస్తూ యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
చంద్రబాబు నిర్ణయం

ఇక, ఇప్పుడు ఏడాది పాలన పూర్తవుతున్న వేళ మరో సారి లోకేష్ ప్రమోషన్ పైన చర్చ తిరిగి మొదలైంది. లోకేష్ కు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించాలని మహానాడు వేది క గా పార్టీ నేతలు డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా జరిగిన పాలిట్ బ్యూరో సమావేశం లొ లోకేష్ మండల స్థాయి నుంచి ఏ నేత వరుసగా మూడు సార్లు కంటే వరుసగా పదవుల్లో కొనసా గరాదని ప్రతిపాదన చేయగా, ఆమోదం లభించింది. ఇదే ఫార్ములా పార్టీ జాతీయ – రాష్ట్ర కమిటీ ల్లోనూ అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. లోకేష్ ను మంత్రిగా పరిమితం చేయకుం డా పార్టీ – ప్రభుత్వం రెండింటా కీలక పదవి ఉండాలనేది ఆయన మద్దతు దారుల డిమాండ్. కాగా, చంద్రబాబు సైతం భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా లోకేష్ కు అవకాశాలు కల్పించా లని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!