Tuesday, April 7, 2026
Homeహెల్త్ న్యూస్బి కింతాడ లో విజయవంతమైన వైద్య శిబిరం

బి కింతాడ లో విజయవంతమైన వైద్య శిబిరం

మాడుగుల: జయజయహే : మాడుగుల నియోజకవర్గ పరిధిలోగల దేవరాపల్లి మండలం,బోయిల కింతాడ గ్రామంలో సోమవారం తగరపువలస అనిల్ నీరుకొండ ఆసుపత్రి సౌజన్యంతో, మాడుగుల మండలం కస్పా జగన్నాధపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వ్యవస్థాపకులు,అనకాపల్లి జిల్లా విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షలు రాపేటి రామ కొండారావు మాస్టర్ ప్రోత్సాహంతో చోడవరం చక్కెర కర్మాగార చెరుకు అభివృద్ధి మండలి మాజీ డైరెక్టర్ అన్నం రామునాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిభిరo విజయవంతమైంది. దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ బూరె బాబురావు ముఖ్య అతిధులుగా విచ్చేసి ఉచిత మెగా వైద్య శిభిరం ప్రారంభించి రోగులకు పలు వైద్య సేవలు అందించి వారికి అనిల్ నీరుకొండ ఆసుపత్రి యాజమాన్యం వారి ఆర్ధిక సహాయంతో ఏర్పాటు చేసిన ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ వైద్య శిభిరంలో 116 మందికి సాధారణ రోగులు హాజరై పలువైద్య సేవలు పొందగా, 26 మంది రోగులను వివిధ ఉచిత శాస్త్ర చికిత్సలుకు ఆసుపత్రికు సిపార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం చక్కెర కర్మాగార చెరుకు అభివృద్ధి మండలి డైరెక్టర్ అన్నం రాము దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాము ,గ్రామ మాజీ ఉప సర్పంచ్ కోమార బాబురావు ,గ్రామ పాలసంఘ మాజీ అధ్యక్షులు అన్నం సాంబమూర్తి , తో పాటు వైద్య శిభిరంలో పలు విభాగ డాక్టర్లు స్త్రీవైద్య నిపుణులు శ్రావ్య ,ఏముకుల వైద్య నిపుణులు తేజ్ నారాయణ,సాధారణ వైద్య నిపుణులు కీర్తి , కళ్ళు వైద్య నిపుణులు అనూషా , చెవిముక్కుగొంతు వైద్య నిపుణులు వర్ష , ఆసుపత్రి వైద్య శిభిర సమన్వయ కర్త ఈశ్వరి, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?