ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఆశా వర్కర్ పై చేయి చేసుకున్న స్టాఫ్ నర్స్ ను సస్పెండ్ చేయాలి

ఆశా వర్కర్ పై చేయి చేసుకున్న స్టాఫ్ నర్స్ ను సస్పెండ్ చేయాలి

📰 Generate e-Paper Clip

చోడవరం: జయజయహే : ఆశా వర్కర్ పై చేయి చేసుకున్న స్టాఫ్ నర్స్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ సోమవారం అనకాపల్లి జిల్లాలో గల వివిధ పీహెచ్సీల వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆశా కార్యకర్తలు అందించిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా కసింకోట పిహెచ్ సి ఆశ వర్కర్ మాధవి ఆదివారం రాత్రి నైట్ డెలివరీ కేసు ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. అక్కడ స్టాఫ్ నర్స్ సరళ పొజిషన్ చూసి చెప్పు అని రూంలోకి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత పది నిమిషాలకి బెడ్ మీద పేషెంట్ డెలివరీ అయింది. ఈ విషయం చెప్పడానికి సరళ దగ్గరికి వెళ్ళింది ఆశా వర్కర్ మాధవి. కేసులు చూసిన వెంటనే స్టాఫ్ నర్స్ సరళ నువ్వు పేషెంట్ ని పుషింగ్ చేయించేసావు అందువల్లే మంచం మీద డెలివరీ అయింది, ముందుగా చెప్పలేదు నాకు అని స్టాఫ్ నర్స్ సరళ ఆశ వర్కర్ మాధవి పై చేయి చేసుకుంది. ఇందుకు నిరసనగా సోమవారం రావికమతం పీహెచ్సీ దగ్గర, ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ పై అనవసరంగా చేయి చేసుకున్న స్టాఫ్ నర్స్ సరళని వెంటనే సస్పెండ్ చేయాలని ఆశకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారూ.రాత్రి పగలు తేడా లేకుండా మేము పనిచేస్తున్నామనీ, మాతా శిశు మరణాలు తగ్గడానికి మా సేవ లే కారణమని వారు అన్నారు.ఈ విషయంలో జాతి స్థాయిలో తమ గుర్తింపు కూడా వచ్చిందన్నారు. ఎంత అన్యాయం అంటే ఒక డెలివరీ కేసు తీసుకెళ్తే రాత్రి పగలు మూడు రోజులైనా అక్కడే ఉండిపోవాల్సి వస్తుందనీ వారు వాపోతున్నారు. తిండి తిప్పలు ఉండవు,నిద్ర ఉండదు ఇల్లు వాకిలి పిల్లల్ని వదులుకొని వెళ్తున్నాం ఒక్క రూపాయి కూడా జీతం లేకుండా 13 సంవత్సరాలు మేము సేవ చేసాం అటువంటి ఆశా వర్కర్లని కొట్టడమా అంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆ స్టాఫ్ నర్స్ సరళ నీ సస్పెండ్ చేయాలి ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వజ్రపు సత్యవతి పిహెచ్ సి లీడర్స్ బీ రత్నం వై లక్ష్మి తదితరులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!