ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీప్రజలకు ఆపదలో అండగా జనసేన పార్టీ

ప్రజలకు ఆపదలో అండగా జనసేన పార్టీ

📰 Generate e-Paper Clip

మాడుగుల : జయజయహే : ప్రజలకు ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రాయపరెడ్డి కృష్ణ అన్నారు. గురువారం సాయంత్రం మాడుగుల మండలంలోని ఘాట్ రోడ్డు జనసేన పార్టీ కార్యాలయం వద్ద క్రియాశీల సభ్యత్వం నమోదు కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 5200 క్రియాశీల సభ్యత్వ నమోదు చేయడం జరిగిందన్నారు. ఒక్క మాడుగుల మండలంలోని 3000 పైగా సభ్యత్వ లు చేయడం జరిగిందన్నారు. ఇంకా మరిన్ని సభ్యత్వాలు నమోదుకు కృషి చేయాలని కోరారు. ఈ సభ్యత్వ నమోదు వల్ల సభ్యులకు పార్టీ అనేక విధాలుగా సేవలు అందజేయనుందని తెలిపారు.అలాగే ప్రమాద బీమా కూడా వర్తిస్తుందన్నారు. పెండింగ్ లో భీమాల నగదు ఆరు నెలల్లో అకౌంట్లోకి జమ అవుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అనేక కార్యక్రమాలు చేపడుతుందని,పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఏలాంటి సమస్యలున్న తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గట్రెడ్డిశివాజీ ప్రధాన కార్యదర్శి దాసరి అచ్యుతరావు, అశోక్ కుమార్, జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!