ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపేద మహిళ పెద్దకర్మకు "వాసుపల్లి" రూ.5000 ఆర్థిక సాయం

పేద మహిళ పెద్దకర్మకు “వాసుపల్లి” రూ.5000 ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం :జయజయహే : దక్షిణ నియోజకవర్గం 36వ వార్డులో నివాసముంటున్న గుమ్మడి పెంటమ్మ పెద్ద కర్మ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్థిక సాయం అందించారు. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం మృతి చెందిన గుమ్మడి పెంటమ్మ కుమారులకు సొంత నిధులు ఐదువేల నగదును అందజేశారు. గతంలో ఆమెకు మెడికల్ ఖర్చులకు కూడా వాసుపల్లి గణేష్ కుమార్ ముందుకు వచ్చి చేయూతనందించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ అత్యధిక పేదలు ఉండే దక్షిణ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో నాన కష్టాలు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. డ్రైనేజీ, కాలువలు రోడ్లపైకి వచ్చి ప్రజలు అనారోగ్యంకి గురవుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే లేరన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అందించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలతో ప్రజలు సంతోషంగా ఉండేవారన్నారు. నేడు మాయమాటలతో అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అందించలేకపోతున్నారన్నారుకేవలం అధికార దాహంతో విశాఖలో జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం ముప్పతిప్పలు పడ్డారన్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వ 10 నెలలనే కుంటిపడిన పాలనలో ప్రజలు మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వాసుపల్లి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!