Tuesday, April 7, 2026
Homeస్పోర్ట్స్పాన్ ఇండియా జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన నాగజ్యోతి

పాన్ ఇండియా జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన నాగజ్యోతి

చోడవరం : జయజయహే : ఈనెల మూడు నాలుగు తేదీల్లో కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో పాన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ పోటీల్లో నాగజ్యోతి నాలుగు బంగారు పథకాలను కైవసం చేసుకుంది. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన ఈమె తాజాగా మరో నాలుగు బంగారు పతకాలను సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చింది. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటకు చెందిన కలగర్ల నాగజ్యోతి రోలుగుంట హై స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. చిన్ననాటి నుంచి కూడా క్రీడలు పట్ల ఆసక్తితో అనేక పర్యాయాలు ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. దాంట్లో భాగంగా ఈనెల మూడు నాలుగు తేదీల్లో ఎర్నాకులంలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 కైవసం చేసుకుంది. దీంట్లో బాగా బెంచ్ప్రాస్, స్క్వాట, డెడ్ లిఫ్ట్, విభాగంలోనూ బంగారు పతకాలు సాధించగా ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా కైవసం చేసుకొని మొత్తం నాలుగు బంగారు పతకాలని స్వాధీనం చేసుకుంది. వీటిని పాన్ ఇండియా ప్రెసిడెంట్ దీప, మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ విఎన్ షాజీ చేతుల మీదుగా అందుకున్నట్టు ఆమె తెలిపింది. ఈ సందర్భంగా సోమవారం మాట్లాడుతూ క్రీడలు పట్ల తనకున్న మక్కువతో నిరంతరం ఉద్యోగంతో పాటు క్రీడలపై కూడా ప్రాక్టీస్ చేస్తూ తనతో పాటు తన కుమార్తెను కూడా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. నా స్వగ్రామానికి నేను చదువు చెప్పే పాఠశాలకు నన్ను ఆదరించే నా బంధుమిత్రులకు నా తల్లిదండ్రులకు నా జిల్లాకు మన రాష్ట్రానికి పేరు తేవాలని ఆశయమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులు బంధుమిత్రులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?