ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపాఠశాల అదనం భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పాఠశాల అదనం భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

మాడుగుల: జయజయహే : మాడుగుల మండలం సాగరం పంచాయతీ డి సురవరం గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలలో అదనపు వసతి భవనాలు నిర్మాణానికి, పాఠశాల ప్రహరి గోడ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సోమవారం శంకుస్థాపన చేశారు. మొత్తం కోటి 64 లక్షల 8 వేల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యం రహదారి రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టడం వంటివాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు . ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంతో పాటు అదనంగా అనేక కార్యక్రమాలు ముఖ్యమైన చంద్రబాబునాయుడు చేపడుతున్నారని చెప్పారు. ఈ పథకాలన్నీ ప్రజల సద్విని పరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదనపు భవనాలు నిర్మాణాలతో విద్యార్థులకు వసతి సమస్య తీరగలదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వేలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, మండల పార్టీ నాయకులు అద్దేపల్లి జగ్గారావు, ఎన్ సన్యాసిరావు,వుండూరు దేముడు, ఉప్పల రమేష్, ఎస్ జగ్గారావు, రమణ స్థానిక కూటమి నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!