మాడుగుల: జయజయహే : పంచాయతీ చొరవతో స్థానికుల కోరిక మేరకు ఎట్టకేలకు మాడుగులలో వారపు సంత మార్పు చేశారు. ప్రతి సోమవారం జరిగే ఈ వారపు సంత రోడ్లమీద జరుగుతుoడడంతో ప్రజలు ముఖ్యంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందికు గురయ్యేవారు.ఇందువల్ల బస్సులతో పాటు వివిధ రకాల వాహనాలు ఇబ్బంది పడేవి.ఈ నేపథ్యంలో ఈ సంతను వెనక్కు మార్చాలని గత కొంతకాలంగా స్థానికులు కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సంత ప్రాంతంలో ఉన్న పాత షెడ్లను తొలగించి ఆ స్థలాన్ని చదును చేసి రోడ్లపై వ్యాపారం చేస్తున్న దుకాణ దారులకు అక్కడ కేటాయింపులు చేశారు. దీంతో ప్రధాన రహదారి విశాలంగా కనిపించడంతోపాటు వాహనాలు రాకపోకలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలు కలిగింది. ఇదే పరిస్థితి కొనసాగే విధంగా ఇటు పంచాయతీ వారు అటు పోలీసు వారు కూడా తగు చర్యలు చేపట్టాలని స్థానికులకు కోరుతున్నారు. సంత మార్పులో చొరవ తీసుకున్న సర్పంచ్ కళావతిని, ఉపసర్పంచ్ వరహాలుని, ఈవో మూర్తి బాబుని స్థానికులు అభినందిస్తూ ఎప్పటికప్పుడు తగు పర్యవేక్షణ చేయడంతో పాటు సంతప్రాంతాన్ని కూడా మరింత శుభ్రం చేస్తూ బ్లీచింగ్, ఫినాయిల్ వంటివి పిచికారి చేసినప్పుడు అక్కడ దోమల వంటివి వ్యాప్తికి అరికట్టవచ్చని సూచిస్తున్నారు.


