Saturday, April 11, 2026
Homeహెల్త్ న్యూస్నేరేడు బంధలో జ్వరాలతో మగ్గుతున్న చిన్నారులు

నేరేడు బంధలో జ్వరాలతో మగ్గుతున్న చిన్నారులు

ప్రతి ఇంట్లో ఒక జ్వర పీడుతుడు

వెంటనే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి

రికార్డుల్లో పేరు లేదని స్ప్రేయింగ్ చేయలేదు

రావికమతం జయజయహే : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజవర్గ పరిధిలో గల రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కొండ శిఖర పివిటిజి కొందు గిరిజన గ్రామం నేరేడు బందులో చిన్నారులు జ్వరాలతో మగ్గుతున్నారు. ఈ గ్రామంలో 14 కుటుంబాలు వారు జీవనం సాగిస్తూన్నారు. ఇంచుమించుగా అన్ని ఇళ్లలోనూ జ్వర పీడుతులు ఉన్నారు. మూడు రోజుల నుండి జ్వరాలతో చిన్నారులు బాధపడుతున్నారనీ వెంటనే ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించాలని గ్రామస్తులతో పాటు సిపిఎం గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గురువారం ఆయా సంఘాల ప్రతినిధులు కే గోవిందరావు, పాంగి చంద్రయ్య, గేమిలి వాసు తదితరులు మాట్లాడుతూ, ఈ గ్రామానికి ఆశా కార్యకర్తలేరనీ, అంగన్వాడి సెంటర్ కూడా లేదనీ, జోగంపేట స్కూల్ కి రాను పోను నడుచుకొని ఆరు కిలోమీటర్లు వెళ్లడంతో ఎండలో తో ఈ పిల్లలు అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఇప్పటికే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో కిలో ప్రభాస్ అనే చిన్నారి వైద్యం పొందుతున్నారన్నారు. మిగిలివారు గ్రామంలోని జ్వరాలతో బాధపడుతున్నారన్నారు. వారిలో పాంగి అభిషేక్, కిల్లో సుందర్రావు, డిప్పల శివాజీ , కిల్లో కమల, సేదరి రత్నం, పాంగి సాయి, కిలో ప్రభాస్ ,గొల్లూరు భాస్కరరావు,పాంగి అంకిత, సేదరి రష్యా,సేదరి బంజి బాబు, డిప్పల విష్ణు ,పాంగి వసంత ఉన్నారన్నారు. ఈ గ్రామం రెవెన్యూ రికార్డులో లేకపోవడంతో మలేరియా స్ప్రింగ్ కూడా చేయకపోవడంతో దోమలు తాకిడి ఎక్కువగా ఉందన్నారు. తక్షణమే జిల్లా అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాంగి చంద్రయ్య. పి వి టి జి సంఘం అధ్యక్షులు గేమిలి వాసు తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయకపోతే డోలీలతో పి.హెచ్.సి కేంద్ర వద్ద ఆందోళన నిర్వహిస్తామనీ హెచ్చరించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ గ్రామాన్ని సందర్శించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

                         

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?