Saturday, April 11, 2026
Homeభక్తినేడు షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు

నేడు షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు

మాడుగుల జయజయహే : మాడుగుల లో వేంచేసియున్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల మూడో తేదీన నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు మండల సతీష్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, కాకడ హారతి మృత్యుంజయ హోమం పంచామృత అభిషేకాలు సాయి సత్య వ్రతాలు, గోపూజ నిర్వహించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం అనంతరం, పారాయణం, సాయంత్రం పల్లకి సేవ, తదుపరి మామ సంకీర్తన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?