నందవరం, శివ సూర్య ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్:
ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా మండల దేశాయి నెట్వర్క్ అధినేత మండల టిడిపి నాయకులు దేశ గురు రాజారావు ఆధ్వర్యంలో నందవరం పంచాయతీ కార్యాలయం ఆవరణంలో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు మండల క్లస్టర్ ఇంచార్జ్ కాసిం వలి, రైస్ మిల్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, సామాజిక కార్యకర్త టిడిపి నాయకుడు ఆల్ఫెర్డ్ రాజ్ ఈ సందర్భంగా దేశాయి నెట్వర్క్ అధినేత మండల టిడిపి నాయకుడు గురు రాజారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రపంచ రక్త దాన దినోత్సవంను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

