ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీదేశ రక్షణలో తెలుగు జవాన్ వీర మరణం..

దేశ రక్షణలో తెలుగు జవాన్ వీర మరణం..

📰 Generate e-Paper Clip

జయజయహే : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేశాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్
అమరుడయ్యారు. ఈ మేరకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. మురళీనాయక్‌ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా.. శనివారం ఆయన పార్థివ దేహం సొంత ఊరికి తీసుకురానున్నారు. మురళీనాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పుట్టి పెరిగారు.. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివారు. మురళి మరణంతో కుటుంబంలో, సొంత ఊరిలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!