Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీజనసేన జెండా ఆవిష్కరణ

జనసేన జెండా ఆవిష్కరణ

సీతంపేట: జయజయహే : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం, లుంబూరు గ్రామంలో జెండా ఆవిష్కరణ మరియు భారీభాహిరంగ సభ నిర్వహించునట్లు సీతంపేట జనసేన మండల అధ్యక్షులు మండంగి విశ్వనాధం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సభకి జనసేన రాష్ట్ర నాయకులు ముఖ్య అధితిగా హాజరై ప్రసంగిస్తారన్నారు.పాలకొండ నియోజకవర్గం శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో లుంబూరు గ్రామంలో ఆదివారం భారీబహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు చొరవ తీసుకోవాలని కోరారు. సభ ప్రాoగణం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సభను జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరమహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?