ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీగౌతమ బుద్ధుని బోధనలు అందరికీ మార్గదర్శకాలు

గౌతమ బుద్ధుని బోధనలు అందరికీ మార్గదర్శకాలు

📰 Generate e-Paper Clip

లైన్స్ క్లబ్ మార్కెటింగ్ ఛైర్పర్సన్ ఉర్లం.శివతేజ

శ్రీకాకుళం: జయజయహే : గౌతమ బుద్ధుని బోధనలు అందరికీ మార్గదర్శకాలని లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ ఛైర్పర్సన్ ఉర్లం.శివతేజ మంగళవారం అన్నారు. గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఉర్లం. శివతేజ మాట్లాడుతూ గౌతమ బుద్ధుని బోధనలు ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా వినాలని, ఆయన జీవిత చరిత్రలో శాంతి, అహింసా, స్త్రీ, సత్యాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారన్నారు. బుద్ధుని బోధనలు వింటే జీవితంలో ఎలా బ్రతకాలో అర్ధమౌతుందని, అందరూ ఆయన పాటించే ఐదు సూత్రాలను తెలుసుకుని ఆచరిస్తే తప్పక మనలో సత్ప్రవర్తన, సేవా రూప నియమావళితో జీవిస్తామన్నారు. పరులకు సహాయపడటం గొప్పవిషయమని, బౌద్ధం స్వేచ్ఛ, సమానత్వం అత్యున్నత విలువనిచ్చిందని, కుల, మత రహిత సమ సమాజ స్థాపనకు పూనుకొని దాన్ని ఆచరణలో పెట్టి భారతదేశ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. బౌద్ధంలో స్త్రీకి అత్యున్నతమైన విలువ, గౌరవం, స్వేచ్ఛను కల్పించింది. ఇలాంటి బౌద్ధం భారతదేశ సమాజానికే కాదు యావత్ ప్రపంచ వర్తమాన, భవిష్యత్తుకు ఒక గొప్ప దార్శనికంగా ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!