చోడవరం: జయజయహే : చోడవరం తాహసీల్దార్ కార్యాలయం వద్ద క్షణంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం కార్యాలయం మెయిన్ గేటు వద్ద కొబ్బరి చెట్టు విరిగి తాసిల్దార్ కార్యాలయం నేమ్ బోర్డు మీద పడడంతో అక్కడ ఉన్న స్థానికులు పరుగులు తీశారు. కార్యాలయంలోకి రాకపోకలు నిలిచిపోయయి . గతంలో కురిసిన వర్షాలకు కొబ్బరి చెట్టు మొదలు నాని పుచ్చిపోయిన కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు.
