Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీకొండ వాలు ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి నగర మేయర్ శంకుస్థాపన

కొండ వాలు ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి నగర మేయర్ శంకుస్థాపన

విశాఖపట్నం : జయజయహే : విశాఖ నగరాభివృద్ధి ధ్యేయంగా నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతున్నదని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన 3వ జోన్ 15వ వార్డు పరిధిలోని వెంకోజిపాలెం కొండ వాలు ప్రాంతాలలో పలు రక్షణ గోడల నిర్మాణానికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ , స్థానిక కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు పలు కంపెనీలను నగరంలో నెలకొల్పుతున్నారని తెలిపారు. వెంకోజి పాలెం కొండ వాలు ప్రాంతాల్లో రక్షణ గోడలు చాలా అవసరం ఉన్నందున కార్పొరేటర్ సూచనల మేరకు 15వ వార్డులో రూ . 3.5 కోట్ల అంచనా వ్యయంతో పలు కొండ వాలు ప్రాంతాలలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసామన్నారు. ఈ రక్షణ గోడల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి సంబంధిత కాంట్రాక్టర్లు అలసత్వం వహించకుండా త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మూడవ జోన్ జోనల్ కమిషనర్ శివప్రసాద్, కార్యనిర్వహక ఇంజనీరు గంగాధర్, సచివాలయం కార్యదర్శులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?