అగనంపూడి: జయజయహే : సి డబ్ల్యూ సి లో ఏ వన్ మాస్టర్ లార్డ్స్ అకాడమీ కోచ్ కొమ్మోజి అశోక్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4 తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయిలో వివిధ క్యాటగిరిలో ఎంపికైన 6 క్రీడాకారులను అభినందించిన ముఖ్య అతిథి గాజువాక రవాణా శాఖ అధికారి వి. విజయప్రకాష్ ,అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత దుర వ్యసనాలకి బానిసలు కాకుండా డ్రగ్స్ కి దూరంగా ఉండి ఇటువంటి క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించి వారి భవిష్యత్తుకి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి వెళ్లి కిక్ బాక్సింగ్ లో విజేతలుగా నిలబడాలని కోరారు. యువతి, యువకులు డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేస్తూ తమ ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారని దానివల్ల వారి కుటుంబం దుఃఖముతో బాధపడుతున్నారని కావున యువత ట్రాఫిక్కు నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుండి కాలేజీల వరకు పిల్లలకు యువకులకు క్రీడల్లో ప్రోత్సహించడానికి స్కూలు యాజమాన్యం, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జి .ఆనంద్ బాలు మాట్లాడుతూ రాయపూర్ లో జరిగే జాతీయస్థాయి లో జరిగే కిక్ బాక్సింగ్ లో ఈ క్రీడాకారులు విజయం సాధించాలని కొమ్మోజి అశోక్ అకాడమీ ప్రారంభించి 6 నెలలోనే 6గురుని రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయడం అభినందినీయమని అన్నారు. ఏడిసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడలు శరీర ధృడత్వానికి ఎంతో దోహదపడుతుందని విద్యార్థులు కేవలం చదువుకే అంకితం కాకుండా క్రీడల్లో కూడా నైపుణ్యం చెందినట్లయితే ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారని అన్నారు. జీవీఎంసీ వారు త్వరగా సమ్మర్ క్యాంపు ప్రకటించాలని కోరారు. ఏ వన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ కొమ్మోజి అశోక్ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు జి పావని నాయుడు, తెలుగు మహిళా నాయకురాలు గోపిశెట్టి పద్మ, వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు కె సుజాత, ఏ డి సి డైరెక్టర్ కొమ్మోజి భీష్మాచారి సీనియర్ క్రీడ కారుడు ఎం అప్పలనాయుడు మరియు కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు.
Homeస్పోర్ట్స్కిక్ బాక్సింగ్ లో రాష్ట్రస్థాయిలో సెలెక్ట్ అయిన 6 క్రీడాకారులు అభినందించిన గాజువాక ఆర్టీవో వి.జయప్రకాష్
కిక్ బాక్సింగ్ లో రాష్ట్రస్థాయిలో సెలెక్ట్ అయిన 6 క్రీడాకారులు అభినందించిన గాజువాక ఆర్టీవో వి.జయప్రకాష్
0
62
Previous article
Next article
RELATED ARTICLES

