Wednesday, April 15, 2026
Homeవిద్య సమాచారంఐసెట్ పరీక్ష నిర్వహిస్తే అడ్డుకుంటాం - ఏబీవీపీ

ఐసెట్ పరీక్ష నిర్వహిస్తే అడ్డుకుంటాం – ఏబీవీపీ

జయజయహే : పీజీ చదవాలనుకునే పేద విద్యార్థులకు గుదిబండల మారినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేసి 2025 ఐసెట్ పరీక్షను నిర్వహించాలని ఏబీవీపీ విజయనగరం విభాగ్ కన్వీనర్ B. సాయికుమార్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 2020లో ప్రైవేట్ కళాశాలలో పీజీ చదవాలనుకునే విద్యార్థుల ఆశలని అడియాశలు చేస్తూ జీవో నెంబర్ 77 తీసుకొచ్చిన మొదటి రోజు నుంచి ఎబివిపి వ్యతిరేకిస్తూ వస్తుంది. అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలు చేసింది గత ప్రభుత్వాన్ని ఎండగట్టింది. అదేవిధంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని పలుమార్లు కలిసి జీవో నెంబర్ 77 పై చర్చించడం జరిగింది ఆయన యువగళం పాదయాత్రలో కూడా చాలాచోట్ల విద్యార్థులకి ఇబ్బందిగా మారినటువంటి జీవో నెంబర్ 77 ను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దుచేసి పీజీ చదవాలి అనుకున్న విద్యార్థులకు బహుమతిగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కి విద్యార్థులకు అన్యాయం చేసి ప్రభుత్వ వచ్చిన తరువాత రెండవ విద్యా సంవత్సరంలో కూడా జీవో నెంబర్ 77పై ఎటువంటి హామీ ఇవ్వకుండా పరీక్ష నిర్వహించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఏదైతే మే 7 2025 నుంచి ప్రారంభమయ్యే ఐసెట్ పరీక్షలకు ముందుగానే జీవో నెంబర్ 77 ని రద్దు చేస్తున్నట్టు ప్రకటింకపోతే రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే ఐసెట్ పరీక్షను అడ్డుకుంటామని,అలాగే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా విద్యాశాఖ మంత్రిని తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంశీ, నగర కార్యదర్శి వర్ధన్ బాబు మరియు నగర సంయుక్త కార్యదర్శి చాణిక్య , ABVP నాయకులు కృష్ణ,నాని ,ధనుష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?