Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీఇంటి వద్దకే రేషన్ పంపిణీ రద్దు? పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇంటి వద్దకే రేషన్ పంపిణీ రద్దు? పై ప్రభుత్వం కీలక నిర్ణయం

జయజయహే :ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్దమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తెచ్చిన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నిలిపివేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించింది. అటు రేషన్ డీలర్లు ఇంటి కే రేషన్ సరఫరా చేసే వాహనాలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటు ఎండీయూ ఆపరేటర్స్ తమకు వచ్చే ఏడాది వరకు అవకాశం ఇవ్వాలని పట్టు బట్టుతున్నారు. దీంతో, ఈ నెల 20న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.వాహనాలు ఏం చేద్దాం వైసీపీ ప్రభుత్వ హాయంలో రేషన్ ను ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా వాహనాల ద్వారా డెలవరీ వ్యవస్థను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవస్థ రద్దు చేయాలని భావించింది. ఇందులో భాగంగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో ఆ శాఖ ఉన్నతాధికారులు రేషన్‌ డీలర్ల సంఘాల ప్రతినిధులతోనూ, ఎండీయూ ఆపరేటర్స్‌ (ఎండీయూ ఆపరేటర్స్‌) సంఘ నాయకులతోనూ విడివిడిగా చర్చలు జరిపారు. రేషన్‌ సరుకుల పంపిణీ కోసం ఎండీయూ వాహనాలను కొనసాగించాలా.. వద్దా అనే అంశం పైన రెండు వైపులా అభిప్రాయ సేకరణ చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?