సోషల్ సైకోలను ఉరి తీయాల్సిందే నీచపు కామెంట్స్ తో మహిళల వ్యక్తిత్వహననం అన్ని రాజకీయ పార్టీలు కఠిన చర్యలు చేపట్టాలి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి మీద టీడీపీ కార్యకర్త చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పార్టీ పరంగానూ అతడిపై టీడీపీ నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేయగా, పోలీసులు చేబ్రోలు కిరణ్ ను గురువారం అరెస్ట్ చేశారని తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. వైఎస్ భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అన్నారు.‘ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి...