రెండు రోజులు వర్షాలు ఉత్తరాంధ్రకు వర్ష సూచన
జయజయహే : ఓవైపు ఎండ...! మరోవైపు వర్షం...! పగలు సెగలు... రాత్రి వాన గుబులు. మధ్యమధ్యలో విరుచుకుపడుతున్న ఈదురుగాలులు... అప్పుడప్పుడు వణుకుపుట్టిస్తున్న వడగళ్లు. అసలీ భిన్న వాతావరణానికి కారణాలేంటి...? ఎండ నుంచి ఉపశమనం పొందేలోపే... వానొచ్చి వణికించడం ఏంటి...? ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఇంతేనా...? వాతావరణశాఖ ఏం చెబుతోంది...? మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది...? తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు భీభత్సమైన ఎండలు జనాలను ఉక్కిరిబిక్కి చేస్తుంటే… అంతలోనే వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అప్పుడప్పుడు ఈదురుగాలుతో కూడిన వడగళ్ల వానలు...