వాటర్ స్కీం కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి కావిడి, ఖాళీ బిందెలతో ఆదివాసి గిరిజనులు వినూత్నంగా నిరసన

రావికమతం : జయజయహే : మంచినీటి పథకానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం అజయ్ పురం గ్రామస్తులు ఖాళీ బిందెలు, నీటి కావులతో నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజయ్ పురం గ్రామంలో 170 మంది జనాభా నివసిస్తున్నారు. 2019-20 సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి 8 లక్షల 40 వేల రూపాయలు వాటర్ స్కీం ఏర్పాటు చేశారు. గత 15 రోజుల నుండి వాటర్ స్కీం కి విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామంలో...