సినీ హబ్ గా విశాఖ- ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కి భూమి కేటాయిస్తాం – భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టూడియో స్థాపనకు అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ల ఆసక్తి

విశాఖపట్నం, జయజయహే : సినిమా పరిశ్రమను తరలించడం ద్వారా విశాఖను సినీ హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. హైదరాబాద్ లో సినీ పరిశ్రమ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయడం కూడా దీనికి ఒక కారణంగా పేర్కొన్నారు. కేవలం ఒక క్లబ్ గానే కాకుండా సినీ సాంకేతిక నిపుణులకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉందని తెలిపారు. తిమ్మాపురం సమీపంలోని ఫిల్మ్ నగర్...