Tuesday, April 7, 2026
Homeశివ సూర్య డైలీక్షతగాత్రుల ప్రాణాలు కాపాడుకుంటాం

క్షతగాత్రుల ప్రాణాలు కాపాడుకుంటాం

కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఆదివారం జరిగిన మందు గుండు సామాగ్రి పేలుడు ఘటనలో గాయాలై నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి అనిత జిల్లా ఉన్నతాధికారులతో కలిసి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీ.ఎం రమేష్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబాలకు క్షతగాత్రులకు దైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలగా ఆదుకుంటుంది అని భరోసా కల్పించారు.మార్చురి వద్ద మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం మిగిలిన మృతదేహాలకు సంబంధించిన పోస్టుమార్టం వేగవంతం చేయాలని డాక్టర్లకి సూచించారు.మెరుగైన వైద్యం కోసం కేజీహేచ్ కు తరలించిన క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో చర్చిస్తున్నట్లు ఎలాగైనా సరే క్షతగాత్రులను కాపాడుకుంటాం అని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?