బీజేపీలోకి విజయసాయిరెడ్డి..? మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ప్రజలు కోరుకుంటే వస్తానని ఇటీవల ప్రకటన వైసీపీ మాజీ నేత రాజకీయ తీరుపై సర్వత్రా ఆసక్తి
జయజయహే : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో మళ్లీ క్రీయాశీలక పాత్ర పోషించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ చేసి సర్వం సిద్ధం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం అందుతోంది. బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే మంతనాలు కూడా జరుగుతున్నాయి. తాను రాజీనామా చేసిన రాజ్యసభ సీటు కాకుండా మరో పదవిపై విజయసాయిరెడ్డి దృష్టి పెట్టారు. రాష్ట్ర రాజ్యసభ రేసులో లేనని ఇప్పటికే ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తాజాగా సంచలన నిర్ణయం...