UPSC ఐఎఫ్ఎస్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు టాపర్స్ వీళ్లే..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఏటా నిర్వహించే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(IFS) పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్ లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా మొత్తం 150 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది యూపీఎస్‌సీ. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్ రెడ్డి దేశవ్యాప్తంగా 11వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. రెండు తెలుగు...