ప్రజాస్వామ్యానికి పట్టం కట్టినది శ్రీమద్రామాయణం – డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

బేతంచెర్ల : జయజయహే: ప్రజల అభిమతం మేరకే దశరధుడు శ్రీరాముడిని రాజుగా ప్రకటించాడని, అలాగే సగర చక్రవర్తి కుమారుడైన అసమంజుడు రాజు కావడాన్ని ప్రజలు అంగీకరించని పక్షంలో ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి తండ్రి అయిన సగరుడు తన కుమారుడిని రాజ్యం నుండే తరిమి వేశాడని, ప్రజాస్వామ్యం యొక్క విలువను చాటిన సద్గ్రంధం శ్రీమద్రామాయణం అని, అందుకే యుగాలు మారినా తరాలు మారినా శ్రీమద్రామాయణానికి అంతటి ఆదరణ అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్...