ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ – గంట సంచలన ట్వీట్.!గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం??
విశాఖపట్నం జయజయహే : విశాఖ నుంచి అమరావతి చేరుకోవడానికి తాను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు.ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకి వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం అందుకొని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యిందని పోస్ట్...