పోలీసుల శ్రమదానం తో “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” ను నిర్వహించిన జిల్లా పోలీసులు: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా

అనకాపల్లి, జయజయహే : ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి స్వచ్ఛత కీలకమైన అంశం అన్న భావనతో, అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమంలో భాగంగా విశేష శ్రమదానం నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ పరిశుభ్రత కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, నాయకత్వంలో జిల్లా పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలు, వాహనాల నిలుపు ప్రాంతాలు, రికార్డు గదులు...