Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీపోలీసుల శ్రమదానం తో “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” ను నిర్వహించిన జిల్లా పోలీసులు:...

పోలీసుల శ్రమదానం తో “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” ను నిర్వహించిన జిల్లా పోలీసులు: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా

అనకాపల్లి, జయజయహే : ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి స్వచ్ఛత కీలకమైన అంశం అన్న భావనతో, అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమంలో భాగంగా విశేష శ్రమదానం నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ పరిశుభ్రత కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, నాయకత్వంలో జిల్లా పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలు, వాహనాల నిలుపు ప్రాంతాలు, రికార్డు గదులు మొదలైనవి శుభ్రపరచడం జరిగింది. సిబ్బంది చెత్త తొలగించి, మొక్కల చుట్టూ ఉన్న కలుపును మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు, “స్వచ్ఛతే ఆరోగ్యానికి నాంది. ప్రజలలో ఈ భావనను బలపరచడం పోలీసుల సహజమైన సామాజిక బాధ్యత,” అని పేర్కొన్నారు. “పోలీసులు కేవలం న్యాయాన్ని కాపాడే వారే కాదు, సమాజ మేలు కోసం ముందుండే నాయకులు కూడా,” అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో మరియు కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలని, తమ చుట్టూ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యాలయ ప్రాంగణంలో చెత్త నిర్వహణకు ప్రత్యేక డస్ట్ బిన్లను ఏర్పాటు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మొక్కలు నాటడం వంటి చర్యలపై దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, పరవాడ సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ వి.విష్ణు స్వరూప్, ఏ.ఓ రామ్ కుమార్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీ, ఎస్.రమేష్, ఎస్సైలు రమణయ్య, సురేష్ బాబు, విశ్వనాథం, గిరి తదితరులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?