సుప్రీం చీఫ్ గా జస్టిస్ గవాయి మే 13న జస్టిస్ ఖన్నా పదవీ విరమణ
భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తన వారసుడిగా జస్టిస్ బిఆర్ గవాయి పేరును అధికారికంగా సిఫార్సు చేశారు. ఆయన పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపారు. దీంతో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాంప్రదాయకంగా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తన వారసుడి పేరును న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13తో ముగియనుంది. సీనియారిటీ జాబితాలో సీజేఐ ఖన్నా తర్వాత జస్టిస్...