SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 11:01 am Posted by : SHIVASURYA NEWS

స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ ను మరోమారు ఆకస్మికంగా సందర్శించిన పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్

గాజువాక :జయజయహే : స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించి స్టేషన్ పరిసర ప్రాంతాలను వ్యర్థాలతో నింపకుండా, ఆయా ఖాళీ ప్రాంతాలను శుభ్రము చేయించి, మొక్కలు నాటాలని ఆదేశించారు, స్టీల్ ప్లాంట్ స్టేషన్ పరిధిలో గల అన్ని సెక్టర్లలో యెటువంటి దొంగతనాలు, అసాంఘిక చర్యలూ జరగకుండా క్రైమ్ పోలీసులు పోలీసింగ్ చేయాలనీ, సీసీటీవీ కెమెరాలు మరిన్ని వినియోగించు విధముగా చర్యలు తీసుకోవాలని తెలిపారు, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ యొక్క ప్రతి కదలిక ఎల్లవేళలా పరిశీలించాలనీ, స్టేషన్ పరిధిలో ఒక్క గంజాయి పెడ్లర్ కూడా ఉండరాదని స్పష్టమైన అదేశాలు జారీ చేశారు. స్టేషన్ ఆవరణలో పలు కేసులతో పెండింగ్ లో ఉన్న వాహనాలను పరిశీలించి, వాటిని డిస్పోస్ చేయుటకు అవసరమైన చర్యలు తక్షణం చేపట్టాలని ఆదేశించారు, అనంతరం పలు ఫైళ్ళను పరిశీలించి, పెండింగ్ కేసులు తక్షణం పరిష్కరించాలని తెలిపారు, అన్ని రిజిస్టర్లు ఎల్లవేళలా అప్డేట్ గా ఉండాలని ఆదేశించారు.